ఈనెల 30నుండి తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నెల 29న జరగబోయే మంత్రివర్గ సమావేశంలో శాసనసభను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకోబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని మొదటినుండి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను వేసింది. కమీషన్ ప్రభుత్వానికి నెలాఖరులో నివేదికను సమర్పించింది. కమీషన్ సమర్పించిన ఈ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టబోతోంది. కాళేశ్వరం నివేదికపై వాడీ వేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే, మాజీసీఎం, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు హాజరవుతారా ? లేదా ? అనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
Also Read..| భారత పర్యటనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ









