Menu

ukrain president zelensky to visit india

భారత పర్యటనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ

భారత పర్యటనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రాబోతున్నారు. ఆయన పర్యటన తేదీని ఖరారు చేసేందుకు ఇండియా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్చుక్ చెప్పారు. గత ఏడాది ఆగస్టులో కీవ్‌లో జరిగిన ఒక సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జెలెన్స్కీని భారతదేశానికి ఆహ్వానించారు. ఆ ఆహ్వానం మేరకు ఇప్పుడు జెలెన్స్కీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Share the post

Also Read..