ఇరాన్‌పై అమెరికా దాడి పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య అంతర్జాతీయ శాంతిభద్రతలకు పెను ముప్పుగా పరిణమిస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రపంచ దేశాలు ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణమే కృషి చేయాలని గుటెరస్ పిలుపునిచ్చారు.
Also Read.. | తెలంగాణ కేబినెట్ .. బనకచర్ల ప్రాజెక్టు పైనే ప్రధాన చర్చ !
గుటెరస్ తన ప్రకటనలో, ఇరాన్‌పై జరిగిన ఈ దాడి ప్రాంతీయ స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులను ఈ దాడి మరింత జఠిలం చేస్తుందని అన్నారు. అంతేకాకుండా ఇది అనూహ్య పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఐరాస చార్టర్లోని నిబంధనలను, ముఖ్యంగా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు సంబంధించిన సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని గుటెరస్ వ్యాఖ్యానించారు.
సైనిక చర్యల ద్వారా ఉద్రిక్తతలను పరిష్కరించడం అసాధ్యమని, దీనివల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని గుటెరస్ స్పష్టం చేశారు. దౌత్యం, చర్చలు మాత్రమే శాశ్వత పరిష్కారాలకు మార్గమని ఆయన అన్నారు. అన్నివైపులా వైరి పక్షాలు సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని అన్నారు. అప్పుడే శాంతియుత పరిష్కారాలకు మార్గం సుగమం అవుతుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ సమాజం ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సమష్టిగా కృషి చేయాలని, చర్చల ద్వారానే సుస్థిర శాంతిని సాధించగలమని గుటెరస్ పునరుద్ఘాటించారు.
I am gravely alarmed by the use of force by the United States against Iran today. This is a dangerous escalation in a region already on the edge – and a direct threat to international peace and security.
— António Guterres (@antonioguterres) June 22, 2025
There is a growing risk that this conflict could rapidly get out of…