మిస్ వరల్డ్ 2025 గా గెలుపొందిన థాయ్ లాండ్ భామ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ బిజీ బిజీగా తన సమయాన్ని గడుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తనకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. మిస్ వరల్డ్ గా గెలుపొందిన మొదటిరోజు హైదరాబాద్ లో కొందరు మీడియా ప్రతినిధులకు ఇంటర్వూలు ఇచ్చారు. ప్రధానంగా జర్నలిస్ట్ శిగుల్ల రాజు అడిగిన ప్రశ్నలకు ఇంర్యూలో సమాధానాలు స్పష్టంగా చెప్పారు. మిస్ వరల్డ్ ఓపల్ సుచాత తన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు అయిన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ (ఎక్స్), ఫేస్ బుక్ అకౌంట్ లలో జర్నలిస్ట్ శిగుల్ల రాజు ఇంటర్వూ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేశారు.
I’m truly humbled by this role and committed to serving with purpose, compassion, and strength. This is only the beginning — and I’m ready to walk this journey with heart and hope.
— Opal Suchata (โอปอล สุชาตา) (@Opalsuchaaata) June 2, 2025
Thank you all for your love and support. 💙🌍 pic.twitter.com/U9fjnv1Aj6
My First Day as Miss World 2025 👑✨Today marks my very first day stepping into the role of Miss World 2025. I had the…
Posted by Opal Suchata on Sunday, June 1, 2025
మిస్ వరల్డ్ గా ప్రజలకు సేవలందించడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. ఈరోజు కేవలం ఆరంభం మాత్రమేనని, ఈ ప్రయాణాన్ని హృదయపూర్వకంగా ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని సుచాత అన్నారు. తన ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే కాలంలో ప్రజలకు మరింత చేరువయ్యేలా, వారి ఆకాంక్షలను నెరవేర్చేలా పనిచేస్తానని ఓపల్ సుచాత స్పష్టం చేశారు.
Also Read…| మిస్ వరల్డ్ కు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ శిగుల్ల రాజు

