72వ మిస్ వరల్డ్ పోటీలలో విజయం సాధించిన థాయ్ లాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ (Opal Suchata Chuang sri) ని ప్రముఖ జర్నలిస్ట్ శిగుల్ల రాజు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. థాయ్ లాండ్ దేశం నుండి మొదటిసారిగా ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకోవడం ఆనందంగా ఉందని చువాంగ్ అన్నారు. అవకాశం వస్తే తెలంగాణకు మళ్లీ వస్తానని అన్నారు.

హైదరాబాద్ లో శనివారం జరిగిన మిస్ వరల్డ్ పోటీలకు ప్రపంచం నలుమూలల నుండి 108 మంది అందగత్తెలు పాల్గొన్న ఈ పోటీలో, థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఆమెకు గత ఏడాది మిస్ వరల్డ్ విజేత, చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని అలంకరించారు.
