NewsTelanganaగ్లోబ‌ల్ కేపిట‌ల్ ఆఫ్ ఏఐ గా తెలంగాణ‌: మంత్రి శ్రీధ‌ర్ బాబు

గ్లోబ‌ల్ కేపిట‌ల్ ఆఫ్ ఏఐ గా తెలంగాణ‌: మంత్రి శ్రీధ‌ర్ బాబు

-

- Advertisment -spot_img

తెలంగాణను గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐ (Global Capital of AI) గా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రెండేళ్లలో రెండు లక్షల మంది తెలంగాణ యువతను అత్యుత్తమ ఏఐ రంగ నిపుణులుగా తీర్చిదిద్దాల‌ని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని మంత్రి అన్నారు. ఆ దిశ‌గా అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో త్వ‌ర‌లోనే ఏఐ యూనివ‌ర్సిటీని ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నామ‌న్నారు. బుధవారం టీ హబ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో తొలి ఏఐ అనుసంధానిత “తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్(టీజీడెక్స్)” ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. “ప్రస్తుతం ఏఐ అంటే కేవలం ఎమర్జింగ్ టెక్నాలజీ మాత్రమే కాదు. మానవ జీవితాలను ప్రభావితం చేసే శక్తి. కొత్త‌గా ఎన్నో అవ‌కాశాలు సృష్టించింది. ఈ మార్పును అందిపుచ్చుకుని తెలంగాణను గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐగా తీర్చి దిద్దేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఆ దిశ‌గా ఇప్ప‌టికే తెలంగాణ ఏఐ స్ట్రాటజీ & రోడ్ మ్యాప్ ను రూపొందించుకుని ఆ దిశ‌గా వడివడిగా అడుగులు వేస్తోంది” అని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

Telangana as Global Capital of AI says minister

“ఏఐను ప్రజలందరూ సమర్థవంతంగా వినియోగించుకునేలా… అనేక సమస్యలకు పరిష్కారం చూపించేలా టీజీడెక్స్ పేరిట డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ను జైకా సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చాం. దీని రూపకల్పనలో బెంగళూరు ఐఐఎస్ సీ వ్యూహాత్మ‌క స‌హ‌కారం అందించింది. ఇది దేశంలో ఏర్పాటైన మొట్టమొదటి ఏఐ డేటా ఎక్స్ఛేంజ్. ఇది కేవలం డేటా ప్లాట్‌ఫామ్ మాత్ర‌మే కాదు. ప్రజాస్వామ్యాత్మకమైన టెక్ పౌరసత్వానికి బలమైన పునాది. ప్రభుత్వ శాఖలు, స్టార్టప్స్, విద్యాసంస్థలు, పరిశోధకులు, యువ‌త అంతా ఒకే వేదికపైకొచ్చి ఎన్నో సమస్యలకు పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు దారి చూపుతుంది. ఇప్పటికే 480కి పైగా డేటాసెట్స్, 3వేలకు పైగా ఏఐ స్టార్టప్స్ ఇందులో భాగస్వామయ్యాయి” అని చెప్పారు.

Global Capital of AI Telangana

“టీజీడెక్స్ ద్వారా రైతులకు మేలు చేసే అగ్రిటెక్ స్టార్టప్స్‌కు డేటా లభిస్తుంది. రోగులకు మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు ఆరోగ్య శాఖకు అవసరమైన ఏఐ మోడల్స్ ను అభివృద్ధి చేయొచ్చు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కి ఉపయోగపడుతుంది. గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్ హ‌బ్ గా తెలంగాణను తీర్చిదిద్దేలా నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు దిక్సూచిగా మారుతుంది. పౌర సేవ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ప్ర‌జ‌ల ముంగిట‌కు చేర్చేందుకు ప్ర‌భుత్వానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే దగ్గర సమాచారం అంతా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు మార్గం సుగమం అవుతుంది” అని వివ‌రించారు.

Telangana become global capital of AI

Also Read..| BJP: ఎమ్యెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. పార్టీకి రాజీనామా

“టీజీ డెక్స్ లో రాబోయే అయిదేళ్ల‌లో 2వేల డేటా సెట్స్ ను చేర్చాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాం. పాల‌న‌లో ఏఐ వినియోగానికి పెద్ద పీట వేస్తున్నాం. ఇప్ప‌టికే ప్రభుత్వం ఆధ్వర్యంలో 30 ఏఐ ఆధారిత ప్రాజెక్టుల‌ను అమ‌లు చేస్తున్నాం. త్వ‌ర‌లోనే క్వాంట‌మ్ కంప్యూటింగ్ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం. పాఠ‌శాల స్థాయి నుంచే నిపుణుల‌ను త‌యారు చేసేలా ఏఐ ఆధారిత అక‌డ‌మిక్‌ క‌రిక్యుల‌మ్ ను రూపొందించాం” అని చెప్పారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్య‌ద‌ర్శి సంజ‌య్ కుమార్‌, ఐటీ స‌ల‌హాదారు సాయి కృష్ణ‌, టీ హ‌బ్ సీఈవో క‌వికృత్‌, టీ వ‌ర్క్ సీఈవో జోగింద‌ర్‌, జైకా ప్ర‌తినిధులు టాకూచీ ఠాకూరో, యుషి న‌గానో త‌దిత‌రులు పాల్గొన్నారు.

Telangana Global Capital of AI Minister Sridhar Babu

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest news

అనుపమ పరమేశ్వరన్ ‘పరాదా’ మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు !

అనుపమ పరమేశ్వరన్ 'పరాదా' మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తార, ప్రస్తుతం మలయాళంలో రూపొందుతున్న 'పరాదా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు...

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు అయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోెర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30 గడువు దగ్గర పడుతున్నది. ఈనేపథ్యంలో...

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...
- Advertisement -spot_imgspot_img

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you