శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరిచంచుకొని దేశవ్యాప్తంగా ఈ రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. శ్రీరామున్ని ప్రజలందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వాడవాడలా సీతారామ కళ్యాణాన్ని జరిపించి లోకకళ్యాణం కోసం ఆ సకల గాణాభి రామున్ని ప్రార్థిస్తారు. ఈరోజు దేశమంతా జై శ్రీరామ్ అంటూ భక్తి భావంతో నిండిపోతుంది. అమయోద్య, భద్రాచలంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.