ఐపీఎల్-17లో భాగంగా హైదరాబాద్, రాజస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు చెరో 9 మ్యాచ్లు ఆడగా, రాజస్థాన్ 8 విజయాలతో ప్రథమ స్థానంలో ఉంది. ఐదింట గెలుపొందిన హైదరాబాద్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ జట్టులో హెడ్, అభిషేక్, అన్మోల్డీత్, క్లాసెన్, నితీశ్, సమద్, షెహబాజ్, జాన్సన్, కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ ఉన్నారు. రాజస్థాన్ టీమ్ లో జైస్వాల్, శాంసన్, రియాన్, జూరెల్, పావెల్, హెట్మయర్, రవి చంద్రన్, బౌల్ట్, అవేశ్ ఖాన్, చాహల్, సందీప్ ఉన్నారు.