కోల్ కతాలోని ఆర్‌జికర్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వైద్యురాలి మృతికి సంఘీభావంగా చాలా మంది తమ సోషల్ మీడియా అకౌంట్ స్టేటస్ లలో బ్లాక్ కలర్ గా చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఆ లిస్టులో చేరారు… ‘జస్టిస్ ఫర్ అభయ‘ నిరసనలో చేరారు. వైద్యురాలిపై లైంగికదాడి చేసి, హత్యచేయడం అత్యంత దురదృష్టకరమని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. మహిళల భద్రతను సమీక్షించాలని గంగూలీ కోరారు.