ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీ రావు(87) శనివారం ఉదయం కన్నుమూశారు. ఈనెల 5న అనారోగ్యంతో హైదారాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థీవ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. ఆయనను చివరి సారిగా చూసేందుకు ఆయన సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.. రేపు ఆయన అంత్యక్రియలు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రామోజీ రావుకు అంత్యక్రియలను అధికారిగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.