ప్రొటెం స్పీకర్ ఎంపికలో బీజేపీ నిర్ణయాన్ని విపక్షపార్టీలు ఖండించాయి. 18వ లోక్‌సభ సమావేశాల సందర్భంగా.. సమావేశాల మొదటి రోజయిన సోమవారం పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద రాజ్యాంగ ప్రతులతో విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళన చేపట్టారు. 8 సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ ఎంపీ కొడికున్నిల్ సురేశ్‌ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయకుండా.. 7 సార్లు గెలిచిన బీజేపీ ఎంపీ భర్తృహరిని ప్రొటెం స్పీకర్ గా చేయడాన్ని తప్పుబట్టారు. బీజేపీ పార్లమెంట్ సాంప్రదాయాలను పాటించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ , ఆపర్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు.