తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిక్షణం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తున్నదని.. బడుగు బలహీన వర్గాలు, మహిళలు, యువత, దళిత, బహుజన వర్గాల ఆర్థిక, సామాజిక వికాసం కోసం విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి రూపొందించిన 80 పాటల సంకలనం “ప్రగతిపథంలో ప్రజాపాలన” పుస్తకాన్ని ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు.
Also Read | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ
ప్రజాపాలనలో అన్నివర్గాల ప్రజలకు ప్రాధాన్యత
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ పథకాలన్నీ ప్రజలకి చేరవేయడంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి కళాకారులు రూపొందించిన పాటలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. గృహలక్ష్మి, గృహ జ్యోతి, ఉచిత బస్సు పథకం, రైతు భరోసా, రైతు రుణమాఫీ, యువకులకి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, పోటీ పరీక్షల సక్రమ నిర్వహణ వంటి కార్యాచరణ ద్వారా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజా అభివృద్ధి పథకాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తోందని చెప్పారు. తెలంగాణలో గొప్ప సాంస్కృతిక వారసత్వం, పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు ఉన్నాయని తెలంగాణ జీవన విధానంలో ఉన్న విశిష్టతని, ప్రజల భాషలో జానపద శైలిలో పాటల రూపంలో రూపొందిస్తూ ప్రజలందరికీ మంచి జీవన విధానం, అలవాట్ల పట్ల అవగాహనను కలిగిస్తూ, చైతన్య పరచాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్బోధించారు.