దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తరువాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నం కల్లా ఏ పార్టీ గెలుస్తుందో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.