కేంద్ర కేబినెట్ లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇప్పటి వరకు ప్రతిపాదనలు, సిఫారసులకే పరిమితమైన జమిలి ఎన్నికలకు (one nation one election) సంబంధించిన అంశం.. తాజాగా దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం జరిగిన కేంద్రకేబినెట్ సమావేశంలో జమిలి ఎన్నికలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్డీఏ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2015లో అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన కమిటీ నివేదికను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. దీంతో, దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలకు మార్గం సుగమం అయింది.
జమిలికి జై..
జమిలి ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగంలోని 324ఎ, 325 అధికరణలను సవరించాల్సి ఉంటుంది. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి నెగ్గించుకుంటామని ప్రభుత్వ ధీమాగా ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను తిరస్కరిస్తుంది. ఈ బిల్లును పార్లమెంట్ లో అడ్డుకుంటామని ఏఐసీసీ చైర్మన్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. అయితే, జమిలి ఎన్నికలు దేశాభివృద్ధికి దోహదపడతాయని, గతంలో కూడా కమిటీలు ఇదే అంశాన్ని చెప్పాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
జమిలి ఎన్నికలు.. మొదటి దశలో అసెంబ్లీ,పార్లమెంట్ కు ఎన్నికలు జరుగుతాయి. రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని 1990 లా కమిషన్ సిఫార్సు చేసిందని కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. 2015లో కూడా రామ్ నాథ్ కోవింద్ కమిటీ అదే విషయాన్ని పునరుద్ఘాటించిందని గుర్తుచేశారు.