ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దేశ ఆర్థిక రాజధానిలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాములతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముంబై శివారు ప్రాంతాలలో బుధవారం కురిసిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలో ప్రతికూల వాతావారణం కారణంగా పలు విమాన సర్వీసులను కూడా దారి మళ్లిస్తున్నారు. గురువారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ముంబాయికి రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం నగరంలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది.