Menu

  • Home
  • తెలంగాణ
  • ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు ‘లిల్లీపుట్’ అంటూ అటాక్ !
MLC kavitha sensational comments

ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు ‘లిల్లీపుట్’ అంటూ అటాక్ !

తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలపై ఆమె తీవ్రంగా స్పందించారు. “నేను తెలంగాణ ఆడబిడ్డను. నా పైన కొందరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రజలందరూ స్పందించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం స్పందించలేదు,” అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని ఆమె ఆరోపించారు. “నేను భయపడే వ్యక్తిని కాదు, తెలంగాణ కోసమే కొట్లాడిన,” అని ఆమె స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నాయకుడిపై కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “బీఆర్ఎస్ పార్టీలో ఒక లిల్లీపుట్ నాయకుడు ఉన్నాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి” అని వ్యాఖ్యానించారు. “కేసీఆర్ లేకపోతే, ఆయన లేడు. నా పైన ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు,” అని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, తాను కేసీఆర్‌కు రాసిన లేఖ ఏ విధంగా బహిర్గతం అయిందో తనకు తెలుసని ఆమె వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం కావడానికి ఆయనే కారణమని, జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణం కూడా ఆయనేనని కవిత ఆరోపించారు. ఆయన గెలుపు “చావు తప్పి కన్నులొట్ట పోయినట్లు ఉన్నది” అని ఎద్దేవా చేశారు. “లిల్లీపుట్ నాయకుడు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది,” అని కవిత అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Also Read…| తెలంగాణ సీఎస్ ప‌ద‌వీకాలాన్ని ప్ర‌భుత్వం పొడిగించేనా..?

Share the post