యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తాను కోలుకుంటున్నట్లు పార్టీ శ్రేణులకు వీడియో సందేశం పంపారు. ఈ నెల 11వ తేదీన తాను ప్రమాదవశాత్తు బాత్‌రూంలో కాలు జారి పడిపోయానని, దీనికి నాలుగు గంటల పాటు మేజర్ ఆపరేషన్ జరిగిందని ఆయన వీడియోలో వెల్లడించారు.
“అందరి దయ వల్ల నేను కోలుకుంటున్నాను” అని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తనను కలవడానికి జనగామ నుంచి చాలా మంది వస్తున్నారని, అయితే వైద్యులు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు ఆయన తెలిపారు. జరిగిన ఆపరేషన్ చాలా పెద్దదని, కాబట్టి కనీసం వారం రోజుల పాటు తనను కలవడానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read.. | నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ : పొంగులేటి
“నేను లేచి నిల్చునే వరకు రావొద్దని కోరుతున్నాను. మీ ప్రేమ అభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అని పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు, కార్యకర్తలు సందేశాలు పంపుతున్నారు.
#pallarajeshwarreddy #Telangana #BRSParty #KCR #pallawithpeople #janagam #janagama #janagaon pic.twitter.com/UBh8bm8JHM
— Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) June 15, 2025