Tuesday, April 22, 2025
HomeNewsTelanganaనిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ

నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ

తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు అనేది పసుపు రైతుల చిరకాల ఆకాంక్ష అని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర పసుపు రైతుల ప్రయోజనాలపై సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రాష్ట్రంలో పసుపు పండించే జిల్లాలలో నిజామాబాద్ ప్రధానమైనది. నిజామాబాద్ పసుపు రైతులు గత 10 సంవత్సరాల నుండి పసుపు మద్ధతు ధర కోసం మరియు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతునే ఉన్నారని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పసుపు రైతులను బలోపేతం చేయడం కొరకు, పసుపు సాగు విస్తీర్ణం పెంచడానికి మరియు పసుపు అనుబంధ విలువ ఆధారిత ఉత్పత్తులను తయారుచేసి, ఎగుమతి అవకాశాలు పెంచడానికి, పసుపు రైతులు కోరుకుంటున్నట్లుగా రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డును తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినట్లయితే పసుపు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

Also read..| మహారాష్ట్ర ఎన్నికల్లో అఘాడి కూటమి విజయం తథ్యం: మంత్రి పొంగులేటి


రాష్ట్రంలో 3,300 ఎకరాలలో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయని, అందులో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (1757 ఎకరాలలో) మరియు ఖమ్మం జిల్లా (696 ఎకరాలలో)ల నుండే 75 శాతం కొబ్బరితోటలు సాగులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ జిల్లాలలోని కొబ్బరి రైతులు కొబ్బరి ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, అక్కడ కొబ్బరితోటల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, అందుకోసం భద్రాద్రి కొత్తగూడంలో ప్రత్యేకంగా రీజనల్ కొకనట్ డెవలప్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని లేఖ ద్వారా కోరడం జరిగింది.
కొకనట్ బోర్డు ద్వారా రాష్ట్రంలోని కొబ్బరి రైతులకు అంతరపంటలు, మిశ్రమ పంటల విషయంలో, చీడ పీడల నివారణలో తగిన సాంకేతిక సలహాలు అందించడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా కొబ్బరి రైతులలో నిర్వహణపరమైన మెళుకువలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా విలువ ఆధారిత ఉత్పత్తులు, నాణ్యమైన కొబ్బరి మొలకలను మరియు నూతన వంగడాలను రైతులకు అందించడానికి అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు.

తెలంగాణలో ఇప్పటివరకు 91,200 హెక్టార్లలో పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారని, ప్రతి సంవత్సరం 40,000 హెక్టార్లలో సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రణాళికలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. త్వరలోనే పామ్ ఆయిల్ సాగులో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రిసెర్చీ అనేది మాత్రమే దేశంలో ఆయిల్ పామ్ పై పరిశోధనలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాల పామ్ ఆయిల్ రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ తోటల విస్తీరణ జరుగుతున్నందున, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రాంతీయ ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పామ్ ఆయిల్ రంగంలో రైతులకు అవసరమైన శాస్త్రీయ,సాంకేతిక సలహాలు సూచనలు అందించాలని మంత్రి లేఖ ద్వారా కేంద్రాన్ని కోరారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
RELATED ARTICLES

Most Popular

Recent Comments