ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై రాజకీయాలా? మంత్రి సీతక్క ఫైర్

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజ‌న ఆశ్ర‌మ పాఠ‌శాలలో జ‌రిగిన ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై రాజ‌కీయాలు చేయడం మానుకోవాల‌ని పంచాయ‌తీరాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ‌, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క‌ (Seethakka) హిత‌వు పలికారు. ఫుడ్ పాయిజన్ తో అనారోగ్య‌బారిన ప‌డిన విద్యార్ధుల‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌న్న మాజీ మంత్రి హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే.. త‌మ ప్ర‌భుత్వం త‌క్ష‌ణం స్పందించింద‌ని మంత్రి సీత‌క్క తెలిపారు. బాధితుల‌కు మెరుగైన వైద్యం ప్ర‌భుత్వం అందించింద‌ని మంత్రి సీత‌క్క గుర్తు చేసారు. తానే స్వ‌యంగా ఆసిఫాబాద్ క‌లెక్ట‌ర్ వెంక‌టేష్ దోత్రే, ఐటీడీఓ పీవో ఖుష్బూ గుప్తా ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ విద్యార్దుల‌కు ఏలాంటి అపాయం జ‌ర‌క్కుండా త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు మంత్రి సీత‌క్క పేర్కొన్నారు. ఈ మేర‌కు మ‌హ‌రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌సీత‌క్క ప‌త్రిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసారు. ఇలాంటి ఘ‌ట‌నలు జ‌ర‌క్కుండా హెల్త్ మానిట‌రింగ్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు తెలిపారు.

ఘ‌ట‌న జ‌రిగిన క్ష‌ణం నుంచి ఐటీడీఓ పీవో ఖుష్బూ గుప్తా ద‌గ్గ‌రుండి మ‌రీ విద్యార్ధుల‌కు మెరుగైన వైద్యం అందేలా చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని తెలిపారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్దుల ఆరోగ్య ప‌రిస్థితిని నిమ్స్ సూప‌రిండెంట్ స‌త్య‌నారాయ‌ణ‌, డాక్ట‌ర్ల‌తో మాట్లాడుతూ ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌ర్ చేసిన‌ట్లు సీత‌క్క తెలిపారు. స్వ‌యంగా సీఎం కార్యాల‌యం సైతం నిరంతం విద్యార్ధుల యోగ‌క్షేమాల‌ను తెలుసుకుంటూనే ఉంద‌ని…మంచిర్యాల మాక్స్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స్ అందించి..మ‌రింత మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ను త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. విద్యార్దినుల వైద్య ఖ‌ర్చుల‌తో పాటు ర‌హ‌దారి ఖ‌ర్చులు పూర్తిగా ప్ర‌భుత్వ‌మే భ‌రించిన‌ట్లు మంత్రి సీత‌క్క పేర్కొన్నారు. ఇప్ప‌టికే రూ. 5 ల‌క్ష‌ల మేర బిల్లుల‌ను చెల్లించిన‌ట్లు చెప్పారు. వైద్య ఖ‌ర్చులు మొత్తం ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తున్న‌ట్లు తెలిపారు. త‌న వంతు భాద్య‌తగా స్థానిక ఎమ్మెల్యే కోవా ల‌క్ష్మీ బాధితుల‌కు ఆర్ధిక స‌హ‌యం చేసి ఉండ‌వ‌చ్చ‌న్నారు.

Also Read.. | ‘ప్రగతిపథంలో ప్రజాపాలన’ 80 పాటల సంకలనం పుస్తకావిష్కరణ

సోమ‌వారం నాడు నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్ధుల‌ను విసిట్ చేయాల‌ని తాను భావించినా..విద్యార్ధులు ఐసీయూలో చికిత్స పొందుతున్నందున చూడ‌టానికి వీలు కాలేద‌ని తెలిపారు. నిమ్స్ సూప‌రిండెంట్ స‌త్య‌నారాయ‌ణ తో సోమ‌వారం మ‌ద్యాహ్నం తాను ఫోన్లో మాట్లాడి నిమ్స్ కు వ‌స్తున్న‌ట్లు ముంద‌స్తు స‌మాచారం అందిస్తే..విద్యార్దినులు ఐసీయూలో చికిత్స పొందుతున్నందున‌.. ఐసీయూలోకి వెల్ల‌డం వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్ సోకుతుంద‌ని.. అందుకే సంద‌ర్శ‌న మ‌రో రోజుకు వాయిదా వేసుకోవాల‌ని సూప‌రిండెంట్ స‌త్య‌నారాయ‌ణ విజ్న‌ప్తి చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. విద్యార్ధులు కోలుకుంటున్నార‌ని…ఏలాంటి ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని డాక్ట‌ర్లు చెప్ప‌డంతో…సంద‌ర్శ‌న‌ను వాయిదా వేసుకున్న‌ట్లు సీత‌క్క తెలిపారు. అధికారులు విద్యార్దినుల ఆరోగ్యాన్ని, అందుతున్న చికిత్స‌ను ప‌ర్య‌వేక్షిస్తూనే ఉన్నార‌ని పేర్కొన్నారు.

ఫుడ్ పాయిజ‌న్ పై రాజకీయాలా ?

విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా త‌మ ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై హ‌రీష్ రావు రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం, తాను నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ ప్ర‌జ‌ల‌కు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామ‌ని మంత్రి సీత‌క్క తెలిపారు. అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌మాధాలుజ‌రిగినా ప్ర‌జ‌ల‌కు ప‌ర‌మార్శించి భ‌రోసా క‌ల్పించ‌ని బీఆర్ఎస్ పెద్ద‌లు, అధికారం కోల్పోగానే ప్ర‌జ‌ల‌పై ప్రేమ కురిపిస్తున్నార‌ని మండి ప‌డ్డారు.

బీఆర్ఎస్ హ‌యంలో వంద‌ల పుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు జ‌రిగి వేలాది మంది విద్యార్ధులు అనారోగ్యం పాలైనా బీఆర్ఎస్ ప‌ట్టించుకోలేద‌ని మంత్రి సీత‌క్క ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. గురుకులాల్లో జ‌రిగిన ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై ఏకంగా హైకోర్టు విచార‌ణ జ‌రిపింద‌ని సీత‌క్క గుర్తు చేసారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో సిరిసిల్ల నుంచి సిద్దిపేట దాకా జ‌రిగిన ప‌లు ఫుడ్ పాయిజ‌న్ కేసుల వివ‌రాల‌ను సీత‌క్క విడుద‌ల చేసారు. ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌ల‌పై రాజ‌కీయాలు చేసి పిల్ల‌ల‌ను, పేరెంట్స్ ను భ‌య బ్రాంతుల‌కు గురి చేయోద్ద‌ని మంత్రి సీత‌క్క విప‌క్షాల‌కు హిత‌వు ప‌లికారు.

మంత్రుల పరామర్శ

వాంకిడి గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజలను మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధవహిస్తుందని భరోసానిచ్చారు. వారిని ఓదార్చారు. విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని నిమ్స్ డైరక్టర్ బీరప్ప, హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్, నెఫ్రాలజీ గంగాధర్ లు మంత్రులకు వివరించారు. వారికి అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్ల కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా వసతి, భోజన సదుపాయాలను కల్పించాలని నిమ్స్ డైరక్టర్ కు మంత్రులు సూచించారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని ధైర్యంగా ఉండాలని వారి తల్లిదండ్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

ponnam konda surekha

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. చికిత్స పొందుతున్న ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థుల ఆరోగ్యం స్థిమితపడుతండగా, మరొక విద్యార్థికి ఇంటెన్సివ్ చికిత్సను అందిస్తున్నారని మంత్రి తెలిపారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులు హాస్టల్ లో పెట్టిన ఆహారంతో అస్వస్థతకు గురి కాలేదని, ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండారాలు తినడం వలనే అస్వస్థతకు గురయ్యారని, అదే ఆహారాన్ని తిన్న సిబ్బంది ఆరోగ్య పరిస్థితి బాగానే వున్నట్లు అధికారులు తెలిపినట్లు మంత్రి సురేఖ వివరించారు. ఏదేమైనప్పటికీ పరీక్షకు పంపిన ఆహారపదార్థాల రిపోర్టులు వచ్చాక ఈ సంఘటనకు బాధ్యులు అధికారులని తేలితే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మంత్రి సురేఖ తేల్చి చెప్పారు.

ponnam konda surekha 1

చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు ఏదో సాకు దొరికింది కదా అని ప్రభుత్వం పై బురదజల్లేలా మాట్లాడారని మంత్రి అన్నారు. వాస్తవావస్తవాలు తెలుసుకోకుండా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం తగదని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హాస్టళ్ళ నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. విద్యారంగ బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలతో కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తున్నదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ ఏర్పాటులో ఎంతో నిబద్ధతతో ముందుకు వెళుతున్నారని అన్నారు. విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమ రంగాలపై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎంతో కచ్చితమైన ప్రణాళికతో పనిచేస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, అర్థరహితంగా ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకోవద్దని మంత్రి సురేఖ సూచించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

Telangana Talli: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదే

సచివాలయ ప్రాంగణంలో డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే తెలంగాణ...

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

Topics

Telangana Talli: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదే

సచివాలయ ప్రాంగణంలో డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే తెలంగాణ...

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

RGV: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్దం! హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img