పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మహారాష్ట్రలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. మహారాష్ట్రలోని ధారవి, సియాన్ కొలివాడ ప్రాంతాలలో ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం బాంద్రాలో జరిగే ఇండియా కూటమి బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ లతో కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొనున్నారు.