Tuesday, March 25, 2025
HomeNewsTelanganaయాదగిరిగుట్ట లోనే దేశంలో మొట్టమొదటి ఎత్తైన స్వర్ణగోపురం

యాదగిరిగుట్ట లోనే దేశంలో మొట్టమొదటి ఎత్తైన స్వర్ణగోపురం

దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణ గోపురం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిదే కావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని దేవాదాయ శాఖామంత్రి కొండా సురేఖ గారు అన్నారు. తెలంగాణలోని దేవాలయాలను పరమ పావన క్షేత్రాలుగా, ప్రశాంత నిలయాలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ అభివృద్ధి, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YTDA) చేపట్టిన పనులపై సమీక్ష చేపట్టనున్న నేపథ్యంలో.. సచివాలయంలోని దేవా దాయ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాలులో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది.

konda review

వైటిడిఎ ఆద్వర్యంలో యాదగిరిగుట్ట సమగ్రాభివృద్ధి

యాదగిరి గుట్ట దేవాలయ సమగ్రాభివృద్ధికి యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటిడిఎ), దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల వివరాలను వైటిడిఎ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, దేవాదాయ శాఖ ఈవో మంత్రి సురేఖకు కూలంకషంగా వివరించారు. వైటిడిఎ ఆధ్వర్యంలో దేవాలయం, పరిసర ప్రాంతాల అభివృద్ధికి మొత్తం 1241.36 ఎకరాల భూమి సేకరించినట్టు గా వైటిడిఎ వైస్ ఛైర్మన్ కిషన్ రావు మంత్రికి తెలిపారు. యాదగిరిగుట్ట దేవాలయ భవిష్యత్ అవసరాల నిమిత్తం సేకరించాలనుకున్న 101.10 ఎకరాల భూమికి సంబంధించిన ఫైలు ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అనుమతుల నిమిత్తం వున్న విషయాన్ని వైస్ ఛైర్మన్ తెలిపారు. మరోసారి సమీక్షించిన తర్వాత భూమిని సేకరించే ది లేనిది తెలియజేస్తామని మంత్రి సురేఖ వైస్ ఛైర్మన్ కు స్పష్టం చేశారు.

Yadagirigutta Yadadri Temple timings

Also Read..| సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం చేయాలి.. అధికారుల సమీక్షలో సీఎస్

అదే విధంగా గాలి గోపురం విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయిన వారికి పరిహారంలో భాగంగా అందించనున్న ప్రయోజనాల వివరాలపై మంత్రి సురేఖ ఆరా తీశారు. వీరిలో 162 మందికి అందించనున్న షెట్టర్ల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసి వాటిని లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు. వైటిడిఎకు కేటాయించిన మొత్తం బడ్జెట్, అందుబాటులో వున్న నిధులు, ఇప్పటికే నిర్ధారించి, పెండింగ్ లో వున్న పనులకు కావాల్సిన నిధులు తదితర వివరాలను వైటిడిఎ విసి కిషన్ రావు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా శుక్రవారం సీఎం సమీక్ష నేపథ్యంలో కచ్చితమైన వివరాలతో రావాలని మంత్రి సురేఖ వైటిడిఎ అధికారులను ఆదేశించారు.

konda 1

దేవాదాయ శాఖ దాతల విరాళాలతో చేపట్టిన వివరాలను యాదగిరి గుట్ట దేవాలయ ఈవో మంత్రికి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా దాతల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో మార్గదర్శకాలను పాటించాలని మంత్రి సురేఖ ఈవోకు సూచించారు. దేవాలయ ఆదాయ, వ్యయాలు, ఆదాయ వనరులు తదితర అంశాల పై మంత్రి సురేఖ ఈవోను ఆరా తీశారు.

1ba71391 c617 460b 8096 d421c4bcd1a7

త్వరలో బంగారు తాపడం పనులు ప్రారంభం

విమాన గోపురం బంగారం తాపడం పనుల వివరాలను మంత్రి ఆరా తీయగా మొత్తం 10 వేల చదరపు అడుగుల బంగారం తాపడం సంబంధిత పనులకు గాను నేటి వరకు 1600 చదరపు అడుగుల పని పూర్తి చేసినట్లు ఈవో తెలిపారు. 15 నవంబర్, 2024 నుండి విమాన గోపురానికి బంగారు తాపడం అమర్చే పనులు ప్రారంభమవుతాయని అన్నారు. బంగారు తాపడం నిమిత్తం 60 కిలోల బంగారం, గోల్డ్ ప్లేటింగ్ తయారీ, ఫిక్సింగ్ ఛార్జీలకు కలిపి మొత్తం రూ. 8 కోట్లను వెచ్చిస్తున్నట్లు వివరించారు. 1 మార్చి, 2025 నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నందున ఈ లోపే పనులు పూర్తి చేయాలని మంత్రి సురేఖ ఈవోను ఆదేశించారు. పనులు పూర్తయిన తర్వాత విమాన గోపురానికి సీఎం రేవంత్ రెడ్డి మహా కుంభాభిషేకం జరిపిన తర్వాత బ్రహ్మోత్సవాలను నిర్వస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో యాదగిరి గుట్ట దేవాలయాభివృద్ధి పై జరుగుతున్న సమీక్షా సమావేశంలో అన్ని వివరాలు సమర్పించాలని ఈవోను మంత్రి ఆదేశించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments