మహారాష్ట్రలో ఓవ్యక్తి పదో ప్రయత్నంలో పదవ తరగతి పాస్ అయ్యాడు. పట్టువదలకుండా తను పరీక్లల్లో ఎన్నిసార్లు ఫెయిల్ అయినా.. చివరికి పాస్ అయి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. మహారాష్ట్రలోని బీడ్ కు చెందిన కృష్ణ నామ్ దేవ్ ముండే 2018 నుండి పదవ తరగతి పరీక్షలు రాస్తూనే వస్తూ.. చివరికి ఈ సారి పాస్ అయ్యాడు. వారి గ్రామంలోని ప్రజలందరూ సంతోషంతో ఆ యువకున్ని మేళతాళాలతో ఊరేగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.