మథురలోని శ్రీకృష్ణ జన్మస్థలాన్ని, కాశీలోని జ్ఞానవాపిని ముస్లింలు హిందువులకు ఇచ్చేయాలని ఆర్కియాలజిస్టు కేకే మహ్మద్ సూచించారు. ‘శివుడు, కృష్ణుడు, రాముడు అనే దేవుళ్లతో ముడిపడిన కాశీ, మథుర, అయోధ్య ప్రాంతాలు హిందువులకు పవిత్రమైనవి. ఆ ప్రాంతాలతో ముస్లింలకు పెద్దగా భావోద్వేగాలేవీ లేవు. వాటిని హిందువులకు ఇచ్చేయడమే సమస్యకు పరిష్కారం’ అని అన్నారు.