ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా సోమవారం అతిశీ ప్రమాణస్వీకారం చేశారు. జైలు నుండి విడుదల అయిన తర్వాత అనూహ్యంగా అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాను మళ్లీ ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చేవరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోనని.. అంతవరకూ ఆపదవిలో ఉండబోనని సీఎం పదవికి రాజీనామా చేశాడు. అనంతరం ముఖ్యమంత్రిగా అతిశీని పార్టీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అతిశీ, తన కుర్చీ పక్కన మరో కుర్చీని ఉంచారు.
తన కుర్చీ పక్కన మరో ఖాళీ కుర్చీ గురించి అతిశీ విలేకరులతో మాట్లాడుతూ.. రామాయణంలోని పలు విషయాలను మీడియాకు వివరించారు. శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్లినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో భరతుడు రాజ్యపాలన చేశడని అన్నారు. అంతేకాదు, రాముని పాదుకాలు సింహాసనంపై ఉంచి, భరతడు రాజ్యాన్ని పరిపాలించాడని.. ప్రస్తుతం ఇది కూడా అలాంటి పరిస్థితే అని వివరించారు. త్వరలో జరిగే ఢిల్లి ఎన్నికల్లో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కడతారని.. సీఎంగా మళ్లీ అరవింద్ కేజ్రీవాల్ ఆకుర్చీలో కూర్చొంటారని.. అప్పటి వరకు ఆకుర్చీ అలాగే ఉంటుందని సీఎం అతిశీ తెలిపారు.
मेरे मन की व्यथा.. pic.twitter.com/xJlg5sI6h9
— Atishi (@AtishiAAP) September 23, 2024