ఒడిశా నూతన ఉప ముఖ్యమంత్రులుగా bjp నేతలు కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవతి పరిదలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీని మంగళవారం పార్టీ అధిష్టానం ప్రకటించింది. భువనేశ్వర్‌లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఒడిశాకు మొదటి మహిళా ఉపముఖ్యమంత్రిగా ప్రవతి పరిద నిలిచారు.