Monday, March 24, 2025
HomeNewsNationalDiwali: జవాన్లతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీపావళి వేడుకలు

Diwali: జవాన్లతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీపావళి వేడుకలు

2014 కు ముందు దేశంలో ఎటు చూసినా ఉగ్రవాదుల అలజడి, బాంబుల దాడి ఘటనల గురించి రోజూ వార్తలు వచ్చేవని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సాయుధ బలగాలతో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (G. Kishan Redy)దంపతులు దీపావళి వేడుకలు (Diwali Celebtations) జరుపుకున్నారు. తన పార్లమెంటు నియోజకవర్గమైన సికింద్రాబాద్ గడ్డమీద ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ ను ఉగ్రవాదులు కాల్చిచంపారని అన్నారు. వేలాది మంది కానిస్టేబుళ్లు, కిందిస్థాయి సిబ్బంది కూడా దేశంలో వేర్వేరు ఉగ్ర ఘటనల్లో అమరులయ్యారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ వేర్పాటువాదం కారణంగా కూడా చాలా మంది మన జవాన్లు బలయ్యారని ఈ సందర్బంగా కిషన్ రెడ్డి తెలిపారు. ఏకంగా పార్లమెంటు భవనంపైనే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితులనుంచి దేశాన్ని కాపాడటం లక్ష్యంగా మోడీ సర్కారు పనిచేస్తోందని అన్నారు. ఈ ప్రయత్నంలో సాయుధ బలగాల కృషి అత్యంత కీలకమైనదని అన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను ఒక్కొక్కటిగా రూపుమాపుతోందని అన్నారు.

జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు

పండగలు, పబ్బాలు అనే తేడా లేకుండా కుటుంబాలను వదిలి నిరంతరం దేశ సేవలో పనిచేస్తున్న ఈ సందర్బంగా కిషన్ రెడ్డి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన సతీమణి కావ్యతో కలిసి పారా మిలటరీ జవాన్లకు మిఠాయిలు పంచారు.140 కోట్ల మంది భారతీయులే కుటుంబసభ్యులుగా, అందరి భద్రతకోసం, దేశ భద్రత కోసం అహోరాత్రులు జవాన్లు చేస్తున్న సేవ మరువలేనిదని కిషన్ రెడ్డి కొనియాడారు. ‘మీ దీపావళి జరుపుకునేందుకు రావడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు.

Also Read..| TTD: టీటీడీ చైర్మెన్ గా బీఆర్ నాయుడు.. 24 మందితో నూతన పాలక మండలి

మోడీ సర్కారు నిర్ణయాల కారణంగా గత పదేళ్లలో దేశంలో ఎలాంటి ఉగ్ర ఘటనలు చోటు చేసుకోలేదని అన్నారు. ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం, వారిని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడం, ఇందుకోసం వ్యూహాత్మక విదేశీ విధానాన్ని అవలంబించడం వల్ల మన దేశం ఆ గడ్డు సమస్యనుంచి బయట పడిందని తెలిపారు. దేశంలో శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధికి బాటలు పడతాయని వివరించారు. అందుకే మోడీ ప్రభుత్వం శాంతిని నెలకొల్పడం ద్వారా దేశంలో పెట్టుబడులను, పారిశ్రామికీకరణను ప్రోత్సహిస్తోందని అన్నారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలనే సంకల్పంతో మోడీ ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా శాంతియుత వాతావరణం కొనసాగడం చాలా అవసరమని.. అందుకు సాయుధ బలగాల పాత్ర కీలకమైనదని కిషన్ రెడ్డి తెలిపారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments