నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై సుప్రీం కోర్టు పరిదిలోని స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఈ పరీక్షను సక్రమంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం చర్చించాలని ఓ ఇంటర్వ్యూలో ఆయన సూచించారు.
నీట్ అక్రమాలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడం సరికాదని అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయాలని ఆయన తెలిపారు.