Menu

  • Home
  • తెలంగాణ
  • HCU: గ‌చ్చిబౌలి భూముల వివాదంపై మంత్రుల క‌మిటీ
bc reservations 42% local body elections

HCU: గ‌చ్చిబౌలి భూముల వివాదంపై మంత్రుల క‌మిటీ

కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు.

ఈ కమిటీ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థులు, ప్రజా సంఘాలతో సంప్రదింపులు జరపనుంది. మరోవైపు, కంచె గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వంద ఎకరాల్లో చెట్లు నరికి వేయడం అనేది చిన్న విషయం కాదని.. చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. తమ ప్రశ్నలకు సీఎస్‌ సమాధానం చెప్పడంతో పాటు అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.  

Also Read.. | హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం.. మరో నాలుగు రోజులు అలర్ట్!

Share the post