Saturday, May 17, 2025
HomeNewsTelanganaహైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం.. మరో నాలుగు రోజులు అలర్ట్!

హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం.. మరో నాలుగు రోజులు అలర్ట్!

హైదరాబాద్ న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురిసింది. గురువారం సాయంత్రం కుండపోతగా వాన కురవడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, ట్రాఫిక్ మాత్రం స్తంభించిపోయింది.

హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, రానున్న నాలుగు రోజులు నగరంలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

Also Read…|ఆర్బిఐ (RBI) డిప్యూటీ గవర్నర్ గా పూనమ్ గుప్తా

దీని దృష్ట్యా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే నాలుగు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రైతులు మరియు ప్రజలు వర్షం పడే సమయంలో బయటకు రావద్దని సూచించారు.

రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల వడగండ్లు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజులు తెలంగాణలో వాతావరణం ఇలాగే ఉండనుందని అధికారులు తెలిపారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments