లోక్‌సభ స్పీకర్ పదవిపై జేడీ(యూ) నేత కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ (తెలుగు దేశం పార్టీ), జేడీయూ ( జనతా దళ్ యునైటెడ్) పార్టీలు ఎన్డీయేతోనే ఉన్నాయని తెలిపారు. బీజేపీ ప్రతిపాదించిన స్పీకర్ నియామకానికి తాము మద్దతు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు.