జనవరి 22న బాల రాముడు గర్భగుడిలో కొలువయ్యాడు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వివరాల ప్రకారం ఇప్పటివరకు అంటే జనవరి 22 నుండి ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల మంది రామ భక్తులు రామ్‌లల్లాను దర్శించుకున్నారని తెలిపారు. ఆలయం ప్రారంభమైన మొదటి 10 రోజుల్లో 25 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించుకున్నారని అన్నారు.