కుంభమేళాకు వెళ్ళి తిరుగు ప్రమాణమైన హైదరాబాద్ వాసులు మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన దుర్ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్‌లోని నాచారం వాసులుగా భావిస్తున్న ఓ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న మినీ బస్సు, ఉదయం 8:15 గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్ జిల్లా, పోలీస్ స్టేషన్ సిహోరా గ్రామం మొహ్లా మరియు బర్గి మధ్య కాలువ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ఓ ట్రక్కు ట్రావెలర్ వాహనాన్ని ఢీకొనడంతో ఏడుగురు అక్కడక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జబల్‌పూర్‌లోని మెడికల్ కాలేజీకి తరలించారు.
జబల్ పూర్ అధికారులుతెలిపిన వివరాల ప్రకారం….
గాయపడిన వారి పేర్లు
- S.నవీనాచార్య S/o రామాచార్య 51
- 2. వి సంతోష్ S/o శ్రీ హరి 47
చనిపోయిన వారి పేర్లు
- ఆనంద్ కన్సారి
- శశి కాన్సారి తండ్రి త్రిభువన్ కన్సారి
- రవి వైశ్య విశ్వనాథన్
- టీవీ ప్రసాద్
- మల్లారెడ్డి
- బాలకృష్ణ శ్రీ రామ్
- రాజు