Menu

  • Home
  • Uncategorized
  • TSRTC: ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన బిల్లు పై న్యాయసలహా కోరిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
Image

TSRTC: ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన బిల్లు పై న్యాయసలహా కోరిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

టీఎస్ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ న్యాయసలహాను కోరారు. ఆర్టీసీ బిల్లును ఆమె న్యాయ కార్యదర్శికి పంపినట్లు సమాచారం. ఇది నిబంధనల్లో భాగంగా జరిగే ప్రక్రియే అని, ఎవరూ ఆందోళణ చెందొద్దని రాజ్‌భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేముందు గవర్నర్ అనుమతి ఇచ్చే సమయంలో గవర్నర్ దాదాపు పది వరకు సిఫారసులను చేశారు. ముఖ్యంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తరువాత ఉద్యోగుల భద్రత, వారి జీత భత్యాలు, ఆర్టీసీ ఆస్తుల లాంటి అంశాలపై ప్రభుత్వానకి సిఫారసులు చేశారు. అవి అన్నీ బిల్లులో పొందుపరిచారా ? లేదా ? అనే వాటిపై న్యాయ సలహా కోరారు. ఈ బిల్లుతో పాటుగా గతంలో తాను తిప్పి పంపిన మరో నాలుగు బిల్లులకు సంబంధించి సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? అనే విషయాలను కూడా తెలుపాలని గవర్నర్ న్యాయసలహా కోరారు. న్యాయ శాఖా కార్యదర్శి సిఫారసుల ఆధారంగా బిల్లులపై తదుపరి చర్యలు ఉంటాయని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

Share the post