Monday, March 24, 2025
HomeNewsTelanganaఆయిల్ పామ్ రైతులకు శుభవార్త.. టన్నుధర 20 వేలకు పైమాటే..

ఆయిల్ పామ్ రైతులకు శుభవార్త.. టన్నుధర 20 వేలకు పైమాటే..

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత, వంట నూనెలను డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ పామ్ సాగును రాష్ట్రంలో పెద్ద ఎత్తున్న చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు.

dd709e56 658f 4bc7 a59e a5134d0a5b1f

ఆయిల పామ్ టన్నుధర ఎంతంటే..

గత సంవత్సరం ఫిబ్రవరిలో టన్నుకి ఆయిల్ పామ్ గెలల ధర రూ. 13,135/- ఉండగా ఈ నెల ఆయిల్ పామ్ గెలల ధర రూ20,871/- పెరగడం తో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని, రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని మంత్రి అన్నారు. ఆయిల్ పామ్ రైతులకు అధిక ధరలను అందించి ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేయటమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రిపేర్కొన్నారు.

1c7222b3 e252 48cb b481 904ec218c172

ఆయిల్ ఫెడ్ వారి ప్రోసెసింగ్ మిల్లులలో నూనె రికవరీ శాతం, ముడి పామాయిల్ అమ్మకం ధరల ఆధారంగా ప్రతి నెల ఆయిల్ పామ్ గెలల ధర నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు. అయితే తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా నడప బడుతున్న అప్పరావ్ పేట మరియు అశ్వరావుపేటలోని ఆయిల్ పామ్ కర్మాగారాలలో నూతన టెక్నాలజీతో కొత్త యంత్రాలు ఏర్పాటు చేయడం.. ఉన్న యంత్రాలను ఆధునీకరించడం వల్ల ఆయిల్ పామ్ గెలల నుండి వచ్చే నూనె రికవరీ శాతం (OER) టన్నుకు 19.02 శాతం నుండి 19.42 శాతానికి పెరగడం ద్వారా పామ్ గెలల ధర పెరుగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు.

oil palm

Also Read.. | చిల‌క‌లూరిపేట రైల్వేలైన్ ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ‌ : ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి

తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయించబడిన ఆయిల్ పామ్ గెలల ధరను ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవ్వాల్సి రావడంతో అక్కడ పామ్ ఆయిల్ రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతున్నది. ఆంధ్రప్రదేశ్ లోని ఆయిల్ పామ్ కంపెనీలు కొంత మంది మీడియేటర్లను ఏర్పాటు చేసి వారి ద్వారా తెలంగాణ ఆయిల్ ఫెడ్ ప్రతిష్టను దిగ జార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఆయిల్ ఫెడ్ రైతుల సంక్షేమం కోసం పని చేస్తూ నూనె రికవరీ శాతం పెంచుతూ ఆయిల్ పామ్ రైతుల మన్నలను అందుకుంటుందని మంత్రి తుమ్మల అన్నారు.

b8a09cb0 49ad 4baf bf0c d723a54df1e3

ఆయిల్ పామ్ రైతులకు రాయితీ ఎంతంటే..

రాష్ట్రంలో 1992-93 నుండి ఇప్పటి వరకు 2.39 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగు జరిగిందని.. వచ్చే సంవత్సరంలో మరో లక్ష ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహించెందుకు ఏకరాకు రూ 50,918/- రాయితిని నాలుగు సంవత్సరాల కాలానికి ఇవ్వడం జరుగుతున్నదని, రైతులు పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేయడానికి ముందుకు రావాలని వ్యవసాయశాఖా మంత్రి కోరారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments