గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ఇస్రో తలపెట్టిన ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్’ (TV-D1) పరీక్ష విజయవంతమైంది. మొదట ఈ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కొంతసేపు వాయిదా వేశారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టగా.. TV-D1 నింగిలోకి దూసుకెళ్లింది. క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను రాకెట్ వదిలిపెట్టింది. అనంతరం పారాచూట్ల సహాయంతో క్రూ మాడ్యూల్ సముద్రంలోకి సురక్షితంగా దిగింది.