హర్యానా జమ్మూకశ్మీర్ లలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. హర్యానాలో 61%, జమ్మూకశ్మీర్ లో 63.88% ఓటింగ్ నమోదయింది. ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. పోలింగ్ ముగియగానే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి.
హర్యానా
హర్యానాలో మెత్తం 90 స్థానాలకు గాను ఎన్నకలు జరిగాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్, రిపబ్లిక్ టీవీ-పీ-మార్క్, ధ్రువ్ రిసెర్చ్, దైనిక్ భాస్కర్ లాంటి సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వెలువరించాయి.
జమ్మూకశ్మీర్
జమ్మూకశ్మీర్ లో 10 సంవత్సరాల తర్వాత ఎన్నకలు జరిగాయి. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమికే ప్రజలు పట్టం కడతారని పలువురు అంచనా వేస్తున్నారు. సొంతంగా ఏపార్టీకి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ రాకపోవచ్చని, హంగ్ అసెంబ్లీకి అవకాశాలు ఉన్నయని సర్వేసంస్థలు అంచనా వేశాయి.