సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తోంది. ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ నినాదంతో ప్రచార బరి లోకి దిగిన ఎన్డీయే, 290కి పైగా సీట్లలో తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. మధ్యప్రదేశ్,ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో నువ్వా నేనా అన్నట్టు ఫలితాలు కనిపిస్తున్నాయి. దేశం లోనే అత్యధికంగా 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో ఇండియా కూటమి తన హవా కొనసాగిస్తోంది. అక్కడి 80 స్థానాల్లో మెజారిటీ స్థానాలు కూటమి కైవసం చేసుకోబోతుంది. ఇప్పటికే 40కి పైగా స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యం కనబరుస్తోండగా, బీజేపీ 36 స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో ఉంది. గత ఎన్నికల్లో 62 స్థానాలు గెలిచిన బీజేపీకి, ఈ సారి ఎదురు గాలి వీస్తోంది.