కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లలో సాధించిన ఎన్నికల ఫలితాలకంటే ఈసారి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోబోతోంది. 2014లో సొంతంగా 464 సీట్లలో పోటీ చేస్తే కేవలం 44 సీట్లకే పరిమితం అయింది. 2019 ఎన్నికల్లో 421 స్థానాల్లో పోటీససిన కాంగ్రెస్ కు 52 స్థానాల్లో విజయం సాధించింది. 2024లో మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన 100 సీట్లలో ఆధిక్యత కనబరుస్తోంది. ఇక కాంగ్రెస్ పని అయిపోయింది అని అయిపోయింది అనే వ్యాఖ్యలు సరికావని, ఇంకా రాబోయే రోజుల్లో పార్టీ పుంజుకుంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు.