Menu

  • Home
  • తెలంగాణ
  • బీసీల‌కు 42% రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదించాల్సిందే..!
Congress demands 42% reservation bill for BCs

బీసీల‌కు 42% రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదించాల్సిందే..!

బీసీల‌కు 42% రిజ‌ర్వేష‌న్ ను ఆమోదించుకోవ‌డానికి తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీ బాట ప‌ట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్ మూడు రోజుల‌పాటు వివిధ కార్య‌క్ర‌మాలు చేయాల‌ని ఇప్ప‌టికే కార్యాచ‌ర‌ణ రూపొందించుకుంది. 4వ‌తేదీన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేష‌న్ చైర్మెన్ లు, ఇత‌ర‌ పార్టీ ముఖ్య‌నేత‌లు హైద‌రాబాద్ నుండి ప్ర‌త్యేక రైలులు ఢిల్లీకి బ‌య‌లు దేరి వెళ్లారు. 5వ తేదీన మంత్రులు, ముఖ్య‌మంత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టునుండి ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్లారు.

5వ‌తేదీన పార్ల‌మెంటులో బ‌సీబిల్లుల‌పై చ‌ర్చించేందుకు వాయిదా తీర్మాణం ఇవ్వ‌డం. 6వ‌తేదీన జంత‌ర్ మంతర్ వ‌ద్ద ధ‌ర్నా కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్నారు. 7వ‌తేదీన రాష్ట్ర‌ప‌తిని క‌లిసి, తెలంగాణ శాస‌న‌స‌భ ఆమోదించిన బీసీ బిల్లుల‌కు ఆమోదం తెల‌పాల‌ని కోర‌నున్నారు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా కామారెడ్డి డిక్ల‌రేష‌న్ లో ఇచ్చిన హామీమేర‌కు తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటి స‌ర్వే జ‌రిపి ఎస్సీ, ఎస్టీ, బీసీల లెక్క‌లు తీసీ, స‌బ్ క‌మిటీ వేసి కేబినెట్, శాస‌న‌స‌భ ఆమోదం త‌ర్వాత రాష్ట్ర‌ప‌తికి బిల్లుల‌ను పంపించామ‌ని, వాటి ఆమోదం కోసం ఢిల్లీలోనే తేల్చుకుంటామ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం చెబుతోంది. మంగ‌ళ‌వారం కాంగ్రెస్ ఎంపీలు పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో ఆందోళ‌న చేశారు.

Also Read..| తెలంగాణ సీఎస్ ప‌ద‌వీకాలాన్ని ప్ర‌భుత్వం పొడిగించేనా..?

అసెంబ్లీలో బీసీ బిల్లుల‌కు బీజేపీ పార్టీ మ‌ద్ద‌తు ఇచ్చింద‌ని, కానీ ఇప్పుడు అందులో ముస్లింలు ఉన్నార‌ని బీసీ బిల్లుల‌ను అడ్డుకోవ‌డం స‌రికాద‌ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మంత్రులు అంటున్నారు. ఇప్ప‌టికైనా బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు బీసీ బిల్లుకోసం పార్ల‌మెంటులో త‌మ‌తో క‌లిసి రావాల‌ని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.

Share the post