తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇండ్ల కేటాయింపు, ముంజూరులో ముందుగా దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, భూమిలేనివారు, పారిశుద్ధ్య కార్మికులు ఈ విధంగా ఒక ప్రాధాన్యత క్రమంలో ఇండ్ల మంజూరు ఉండాలని సీఎం అన్నారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల పై సీఎం హైదరాబాదా లోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇందిరమ్మ ఇళ్లు తొలిదశలో వీరికే..
తొలిదశలో సొంతస్థలం ఉన్నవారికి ఇండ్లు కట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నందున అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇందులో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటుగా అవసరమైన సాంకేతికతను ఉపయోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ అప్లికేషన్ లో ఎటువంటి లోటు పాట్లు లేకుండా చూడాలని అన్నారు. ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బందులు కలగనీయవద్దలని అన్నారు. అధికారులు శాఖాపరంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు తగన చర్యలను తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
Also Read..| హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు
ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అందుకు తగిన అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం సమర్థవంతంగా కొనసాగించేందుకు వీలుగా గృహ నిర్మాణశాఖ బలోపేతం కావాలని అన్నారు. అందుకు అవసరమైన అధికారులను, సిబ్బందిని నియమించుకోవాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవాలని చెప్పారు.
— Telangana CMO (@TelanganaCMO) November 29, 2024
♦️మంత్రి @mpponguleti గారు,… pic.twitter.com/IR2xEpRKyr