NewsTelanganaహైదరాబాద్ - టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

-

- Advertisment -spot_img

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో ఇండియాలోని టర్కీ రాయబారి ఫిరాట్ సునెల్ హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ – టర్కీ దేశాల మధ్య నిజాం కాలం నుండి మెరుగైన సంబంధాలు ఉండేవన్నారు. టర్కీ రాయబారి హైదరాబాదులోని సంస్కృతి, సాంప్రదాయాలను చూసి తను సొంత దేశంలో ఉన్న అభిప్రాయం కలిగిందన్నారు.

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ టర్కీ దేశపు రాయబారి ఫిరాట్ సునెల్ కు వెల్లడించారు. ముఖ్యంగా సామాన్యులకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 34 ప్రభుత్వ మెడికల్ కళాశాల తో పాటు 28 నర్సింగ్ కళాశాలలు, పారామెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 74 ట్రామా కేర్ సెంటర్లు తో పాటు మెరుగైన హెల్త్ ఎడ్యుకేషన్ ను రాష్ట్రంలో అందించేందుకు ప్రణాళికలను రూపొందించామన్నారు. 60 శాతం బల్క్ డ్రగ్ ఉత్పత్తులు తెలంగాణ నుండి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు.

Also Read…| ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

మెడికల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా టర్కీ – తెలంగాణ ల మధ్య మెరుగైన సంబంధాలను పునరుద్ధరణ జరగాలని కోరుకున్నారు. మెడికల్ ఫ్యాకల్టీ, మెడికల్, మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ – టర్కీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని కోరుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్, TGMSIDC MD హేమంత్ సహదేవ్ రావ్ లు పాల్గొన్నారు

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you