Menu

  • Home
  • తెలంగాణ
  • తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన వివరాలివే..
telangana cm revanth reddy delhi visit

తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన వివరాలివే..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. రేపు శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన సాగుతోంది.

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి..

  • ఉదయం 11 గంటలకు: తాజ్ ప్యాలెస్ హోటల్‌లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి. మర్ఫీతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో ఇరు ప్రాంతాల మధ్య సహకారం, పెట్టుబడుల అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
  • ఉదయం 11:30కు: బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ నిర్వహించే 12వ వార్షిక ఫోరమ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ఆర్థికాభివృద్ధి ప్రణాళికలను వివరించనున్నారు.
  • మధ్యాహ్నం 12 గంటలకు: అమెజాన్, కార్ల్స్‌బర్గ్, కార్లైల్, గోద్రెజ్, ఉబెర్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ఆయన విడివిడిగా సమావేశమవుతారు. ఈ సమావేశాల్లో తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై చర్చలు జరపనున్నారు.
  • మధ్యాహ్నం 12:30కు: ముఖ్యమంత్రి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు, సీఈఓ మరియు నార్వే మాజీ యూనియన్ మంత్రి అయిన బోర్జ్ బ్రెండేతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సమావేశం తెలంగాణకు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తీసుకొచ్చేందుకు దోహదపడనుంది.

Share the post

Also Read..