గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కులగణనతో పాటు పలు అంశాలకు సంబందించి బుధవారం సాయంత్రం సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ మరియు గుత్తా అమిత్ రెడ్డిలు రాజ్ భవన్ కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్ధిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును ముఖ్యమంత్రి @revanth_anumula గారు రాష్ట్ర గవర్నర్ @Jishnu_Devvarma గారికి వివరించారు. ఈ సర్వే ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు రాజ్భవన్లో గవర్నర్ గారితో భేటీ అయ్యారు.… pic.twitter.com/xNhVmH0e5B
— Telangana CMO (@TelanganaCMO) November 6, 2024
రాష్ట్రంలో బుధవారం నుండి ప్రారంభమైన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే తీరును గవర్నర్ కు సీఎం వివరించారు. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలను గవర్నర్ కు తెలియజేశారు. సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలవనుందని గవర్నర్ కు వివరించారు. మూసీ ప్రక్షాళన వల్ల ఎవరికీ నష్టం జరగకుండా ఉండాలని సీఎంకు గవర్నర్ సూచించారు. ఇప్పటికే పేదలకు డబుల్ బెడ్ రూంలు అందిచామని సీఎం తెలిపారు. అందరినీ ఆదుకుంటామని గవర్నర్ కు సీఎం తెలిపారు.
Also Read..| డెడికేటెడ్ కమీషన్ చైర్మెన్ బాధ్యతల స్వీకరణ
కులగణన అంశం కేంద్రం దృష్టికి..
2025లో చేపట్టే దేశవ్యాప్త జనగణనలో తెలంగాణ సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్ ను కోరారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్ ను ఆహ్వానించారు.