తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు, మెంబర్ గా ఐఎఫ్ఎస్ అధికారి, బీసీ గురుకులాల సెక్రటరీ బడుగు సైదులు భాధ్యతలు స్వీకరించారు. మాసబ్ ట్యాంక్ లోని డిఎస్ఎస్ భవన్ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోగా నివేదిక తయారు చేయడానికి ఈ కమిషన్ పనిచేస్తుందని వారు తెలిపారు.
Also Read..| ఫుడ్ పాయిజన్ ఘటనపై రాజకీయాలా? మంత్రి సీతక్క ఫైర్
డెడికేటెడ్ కమీషన్ ఎందుకంటే..?
ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనకు స్పెషల్ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ వెంకటేశ్వరరావును ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమించారు. నెల రోజుల్లో నివేదిక అందించాలని కమీషన్ కు ప్రభుత్వం సూచించింది. బీసీల రిజర్వేషన్ల విషయంలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా.. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయడానికి బీసీ కులగణన కీలకంగా మారనుంది.