Menu

  • Home
  • జాతీయం
  • Esha singh: ఆసియా క్రీడల్లో బంగారు పథకం సాధించిన తెలంగాణ బిడ్డ ఈషా సింగ్.. అభినందించిన సీఎం కేసీఆర్
Image

Esha singh: ఆసియా క్రీడల్లో బంగారు పథకం సాధించిన తెలంగాణ బిడ్డ ఈషా సింగ్.. అభినందించిన సీఎం కేసీఆర్

చైనాలో జరుగుతున్న ‘ఆసియా గేమ్స్ 2023’ లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్) లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్ టీం స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈషా సింగ్ టీం 1759 పాయింట్లతో భారత్ కు గోల్డ్ మెడల్ సాధించి, టీం స్పిరిట్ ను చాటిందని సీఎం అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అమలు చేస్తున్ప కార్యాచరణే జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికల్లో తెలంగాణ క్రీడాకారులు కనబరుస్తున్న ప్రతిభకు నిదర్శనమని ముఖ్యమంత్రి తెలిపారు. మన రాష్ట్ర క్రీడాకారులు రానున్న రోజుల్లో మరెన్నో పతకాలు సాధించి, తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని జగద్విదితం చేయాలని ఈ మేరకు సీఎం ఆకాంక్షించారు.

Share the post

Also Read..