2047 నాటికి దేశంలో అవినీతి, కులతత్వం, మతతత్వానికి స్థానం ఉండదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జాతీయ భావనలో వీటికి తావు ఉండదని స్ఫష్టం చేశారు. ఢిల్లీలో PTI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ప్రధాని మాట్లాడారు. ప్రపంచం జిడిపి కేంద్రీకృత దృక్పథం ( GDP-centric view) నుండి మానవ-కేంద్రీకృత దృక్పథానికి ( human-centric viwe) మారుతుందని ప్రధాని అన్నారు. రాబొయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలో కీలక పాత్ర (role of catalyst) పోషిస్తోందని అన్నారు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ కూడా లోక కళ్యాణానికి మార్గదర్శకంగా మారుతుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.