దివంగత బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ప్రకటించింది. 1977-79 మధ్య కాలంలో బీహార్ సీఎంగా పని చేశారు. ఓబీసీ నాయకుడిగా ఆయనకు ‘జన నాయక్’ అనే పేరు కూడా ఉండేది. ఆయన శత జయంతి సందర్భంగా కర్పూరి ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించారు.సోషలిస్టు పార్టీ, భారతీయ క్రాంతి దళ్ పార్టీల తరఫున 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకూ బీహార్ సీఎంగా పని చేశారు. తిరిగి 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకూ సీఎం గా ఉన్నారు.బీహార్ లోని సమస్తిపూర్ లో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పని చేసి జైలు పాలయ్యారు కూడా.. 1952 లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.