అదానీ, అంబానీ లాంటి క్రోనీ క్యాపిటలిస్టుల (క్రోనీ క్యాపిటలిజం) నుండి జార్ఖండ్ కు విముక్తి కల్పించండని ప్రజలకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఎఐసిసి పరిశీలకుడు, స్టార్ క్యాంపెయినర్ మల్లు భట్టి విక్రమార్క జార్ఖండ్ ప్రజలను కోరారు. ఇండియా కూటమి అభ్యర్థులను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ణప్తి చేశారు. ఆదివారం జార్ఖండ్ రాష్ట్రం రాం ఘర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ మీటింగ్ లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.

చిత్తార్పూర్ సీ, డీ బ్లాక్ రాజరప్ప బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఝార్ఖండ్ ప్రజల పోరాట స్ఫూర్తిని ఆయన కొనియాడారు. మల్లిఖార్జున ఖర్గే నాయకత్వం లో రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేసిన భారత్ జోడో యాత్రతో దేశం లో ప్రజాస్వామిక శక్తులను ఏకం చేశారని అన్నారు. రాహుల్ గాంధీ రెండు సందేశాలు దేశానికి ఇచ్చారని అన్నారు. విద్వేషాలను రగిలించే వారి చేతిలో ఈ దేశాన్ని పెట్టేందుకు మేము సిద్ధంగా లేమని, విశాల భారతదేశంలో ప్రేమ అనే దుకాణం తెరిచి అన్ని జాతులు, మతాలకు సమాన అవకాశాలు ఇస్తామనే సందేశం ఇచ్చారని వివరించారు. అదే సందర్భంలో ఈ దేశంలోని వనరులు, సంపద, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశ ప్రజలకే చెందాలి తప్ప, కొద్ది మంది క్రోనీ క్యాపిటలిస్ట్ ల చేతిలో పెట్టేందుకు సిద్ధంగా లేమని తెలిపారు.
Also Read..| ఫ్యూచర్ సిటీకి డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ విజిట్

అదాని, అంబానీ వంటి క్రోనీ క్యాపిటలిస్ట్ ల నుండి దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే జార్ఖండ్ వనరులు రక్షించబడతాయని అన్నారు. ఈ దేశ సంపద జనాభా నిష్పత్తికి అనుగుణంగా పంపిణీ జరగాలి అంటే రాజ్యాంగాన్ని రక్షించుకొని ముందుకు పోవాలని.. అందుకు ఇండియా కూటమి అభ్యర్థుల ను గెలిపించడమే మన ముందు ఉన్న లక్ష్యం అని తెలిపారు. కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో జార్ఖండ్ రాష్ట్రాన్ని పెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని అన్నారు. చైతన్యం గల కాంగ్రెస్ కార్యకర్తలు ఝార్ఖండ్ రాష్టాన్ని, ఇక్కడి వనరులను ఆ దోపిడీ దారుల నుండి కాపాడు కోవాల్సిందిగా పిలుపు నిచ్చారు. ఝార్ఖండ్ ప్రజలు డబ్బుకు లొంగి పోయే రకం కాదని.. వారికి వివేచన, విచక్షణ ఉందనీ ఆ పరంపరను కాపాడాల్సిందిగా పిలుపు నిచ్చారు. బ్లాక్, గ్రామ కాంగ్రెస్, పోలింగ్ బూత్ అధ్యక్షులు సమావేశమై విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ఇండియా కూటమి ఇస్తున్న హామీలు, మేనిఫెస్టోను ఓటర్లకు పెద్ద ఎత్తున వివరించాలని, విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. రాంఘర్ అభ్యర్థి మమతా దేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని, అలాగే కూటమి అభ్యర్థులను అందరినీ గెలిపించాలన్నారు.
Addressed the booth-level meeting at Ramgarh for the Jharkhand Assembly Elections! Let’s save Jharkhand from crony capitalism—vote for India Alliance candidates to protect resources and ensure equal opportunity for all. We won’t let BJP hand over Jharkhand to a few investors like… pic.twitter.com/iHxXUf1fW3
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) November 10, 2024