కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మెగాస్టార్, పద్మభూషణ్ చిరంజీవిని కలిశారు. ఆదివారం సాయంత్రం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకున్న బండి సంజయ్ ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి సత్కరించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘‘సంజయ్ గారు… మీరు ఎంతో కష్టపడి పైకొచ్చారు. మీరు మంత్రి కావడం చాలా ఆనందంగా ఉంది. మీ అగ్రెసివ్ మెంటాలిటికి తగిన పోస్ట్ లభించింది.’’అని చిరంజీవి బండితో అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ తమను దగ్గరకు తీసుకుని పలకరించడం మర్చిపోలేని అనుభూతిగా మిగిలిందని ఈ సందర్భంగా చిరంజీవి బండి సంజయ్ కు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్పందిస్తూ ‘నేను విద్యార్ధి దశలో మీ సినిమాలకు అభిమానిని’ అని చిరంజీవితో అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జన సేన కూటమి మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. ప్రజలకు మంచి పాలన అందిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అనంతరం ఇరువురు దేశ, రాష్ట్ర రాజకీయాలపై కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
Always a delight to meet Annaya Megastar @KChiruTweets garu – a well wisher and humble person.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 23, 2024
I was a fan of his movies during student days pic.twitter.com/hP9lvd6qvf