అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి దర్శన భాగ్యం కలిగింది. కేరళలోని శబరిగిరులు అయ్యప్పనామస్మరనతో మార్మోగాయి. పోన్నాంబలమేడ కొండపై నుండి మకరజ్యోతి కనిపించింది. మూడుసార్లు భక్తులకు జ్యోతి దర్శనం కలిగింది. స్వామియే శరణమయ్యప్ప శరణుఘోషతో శబరికొండలు పులకించాయి. జ్యోతిదర్శనానికి 50వేల భక్తులకు మాత్రమే దేవాలయబోర్డు అనుమతిచ్చింది. అయితే దాదాపు 4 లక్షలకు పైగా భక్తులు ప్రత్యక్షంగా జ్యోతిదర్శనం చేసుకున్నారు.